తాడిపత్రిలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ సత్యనారాయణ యాచారం, సెప్టెంబరు 24 (చైతన్యగళం): యాచారం మండలం తాడిపత్రి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గురువారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సునీల్ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు, మద్యపానం, ఆన్‌లైన్ ఆటలకు...