Friday, November 6, 2026
Homeతెలంగాణకరీంనగర్నల్ల బ్యాడ్జీలతో మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నిరసన

నల్ల బ్యాడ్జీలతో మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల నిరసన

📰 Generate e-Paper Clip

  • న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణ

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. మోడల్‌ స్కూల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఎంఎస్‌ జేఏసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, టీజీ టీమ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మోడల్‌ స్కూల్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేచవేని కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ మోడల్‌ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, 010 పద్ధతిలో నెలవారీ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలు కల్పించాలని, సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు మంజూరు చేయాలని కోరారు. టీజీటీ ఉపాధ్యాయులకు నోషనల్‌ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు వివరించారు. ఎంఎస్‌ జేఏసీ ప్రకటించిన ఐదు రోజుల కార్యాచరణలో భాగంగా తదుపరి దశలో మండల, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తమ డిమాండ్లపై వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత, రాజశ్రీ, శ్రీధర్‌రెడ్డి, గంగరాజు, రమేష్‌, ఉమారాణి, హైమావతి, కళ్యాణ్‌సింగ్‌, నరసింహులు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!