- డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి
- టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్
హుస్నాబాద్, నవంబర్ 6 (చైతన్యగళం): ఆర్టీసీ కార్మికులను కింద కూర్చోబెట్టి అవమానించిన సిద్దిపేట డిపో మేనేజర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులను గౌరవంగా చూడాల్సిన బాధ్యత కలిగిన అధికారి వారిని కింద కూర్చోబెట్టడం తీవ్ర అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని అన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనపై వెంటనే స్పందించి సిద్దిపేట డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కార్మికుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టీఎంయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీఎంయూ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కేస్ రెడ్డి, యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
