Monday, November 2, 2026
Homeతెలంగాణకరీంనగర్400 మీటర్ల పరుగులో హుస్నాబాద్‌ విద్యార్థికి ప్రథమ స్థానం

400 మీటర్ల పరుగులో హుస్నాబాద్‌ విద్యార్థికి ప్రథమ స్థానం

📰 Generate e-Paper Clip

  • రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు జి. రిశ్వంత్‌ ఎంపిక

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం):

ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థి జి. రిశ్వంత్‌ ప్రతిభ చాటాడు. 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.

సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల ఉమ్మడి స్థాయిలో 14, 17 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీలను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల జి. రిశ్వంత్‌ 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

విజేతగా నిలిచిన రిశ్వంత్‌ను సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి బంగారు పతకంతో సత్కరించి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌, అధ్యాపకులు శ్రీనివాస్‌ రాజు, రజిని అభినందించారు. విద్యార్థి కృషి, ప్రతిభను హుస్నాబాద్‌ మండల ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి ఆర్‌. శ్రీనివాస్‌ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి నర్రా భాస్కర్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. వెంకటస్వామి, సీనియర్‌ పీడీలు సుజాత, రామేశ్వర్‌రెడ్డి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!