Friday, November 6, 2026
Homeతెలంగాణకరీంనగర్వల్లభాపూర్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు

వల్లభాపూర్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ సేవలు చిరస్మరణీయం: ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్‌రెడ్డి

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్‌ ఉన్నత పాఠశాలలో భారతరత్న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉక్కు మనిషిగా పేరుగాంచిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే నేడు ఐక్య భారతదేశాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో పటేల్‌ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన దేశభక్తి, అంకితభావం నేటి పాలకులు, అధికారులు, ప్రజలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, పద్మలత, కల్యాణి, రమాదేవి, అఖిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!