- కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఘన నివాళులు
ఎల్కతుర్తి రూరల్, అక్టోబర్ 31 (చైతన్యగళం): దేశానికి విశేష సేవలందించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతరబోయిన లింగమూర్తి, ఉపసర్పంచ్ మేకల బాబు, మాజీ సర్పంచ్ మరి సురేందర్ తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొని ఇందిరా గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

