నల్ల బ్యాడ్జీలతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన
న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణ ఎల్కతుర్తి, అక్టోబర్ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. మోడల్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంఎస్ జేఏసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, టీజీ టీమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్...