Wednesday, November 18, 2026
Homeతెలంగాణకరీంనగర్అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధి ఏదీ?

అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధి ఏదీ?

📰 Generate e-Paper Clip

  • దుమ్ము, ధూళితో ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించాలి
  • అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రధాన కూడలిగా ఉన్న అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ హుస్నాబాద్‌ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు విమర్శించారు. రహదారి సమస్యను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

చౌరస్తా పరిసరాల్లో వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము, ధూళి విపరీతంగా లేస్తోందని, దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులతో పాటు సమీపంలోని దుకాణాల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుకాణాల్లోకి దుమ్ము చేరుతుండటంతో వ్యాపార నిర్వహణ కష్టంగా మారుతోందని పేర్కొన్నారు. దుమ్ము కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాన కూడలిగా ఉన్న అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని బత్తుల శంకర్‌బాబు కోరారు. చౌరస్తా అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించడం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం చేసినట్లేనని ఆయన విమర్శించారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన ఈ ప్రాంతంలో రహదారి సమస్యను పరిష్కరించి, ప్రజలకు దుమ్ము, ధూళి నుంచి ఉపశమనం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. లేనిపక్షంలో వ్యాపారులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బత్తుల శంకర్‌బాబు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!