Wednesday, November 18, 2026
Homeతెలంగాణకరీంనగర్అదనపు ట్రైనీ కలెక్టర్‌ రోహిత్‌ను కలిసిన రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇంగె భాస్కర్‌

అదనపు ట్రైనీ కలెక్టర్‌ రోహిత్‌ను కలిసిన రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇంగె భాస్కర్‌

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి తహసీల్దార్‌ కార్యాలయంలో అదనపు ట్రైనీ కలెక్టర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రోహిత్‌ను ఉమ్మడి కరీంనగర్‌–హనుమకొండ జిల్లాల రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇంగె భాస్కర్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్‌కు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఇంగె భాస్కర్‌ మాట్లాడుతూ, రోహిత్‌ ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నంతకాలం మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రైతుల సమస్యలను సకాలంలో పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన సేవలు సజావుగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అంబరి శ్రీనివాస్‌, కోదాటి మాధవరావు, జీలుగుల మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!