అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధి ఏదీ?

దుమ్ము, ధూళితో ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించాలి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రధాన కూడలిగా ఉన్న అంబేద్కర్‌ చౌరస్తా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు, స్థానిక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ హుస్నాబాద్‌ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు విమర్శించారు. రహదారి సమస్యను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు....