Tuesday, October 27, 2026
Homeక్రైమ్ న్యూస్స్టిక్కర్ల మాటున లిక్కర్ దందా.. ఎల్లుతుర్తిలో ఎక్సైజ్ దాడులు

స్టిక్కర్ల మాటున లిక్కర్ దందా.. ఎల్లుతుర్తిలో ఎక్సైజ్ దాడులు

📰 Generate e-Paper Clip

ఎల్కతుర్తి, అక్టోబర్ 26 (చైతన్యగళం):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో స్టిక్కర్ల పేరుతో జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. కొన్ని పత్రిక దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఎక్సైజ్ ఎస్పీ జె. మౌనిక తన బృందంతో ఎల్కతుర్తి మండలంలోని పలు హోటళ్లు, బెల్ట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో బెల్ట్ షాపులలో హోటళ్లలో విక్రయిస్తున్న మద్యం సీసాలపై అదనపు స్టిక్కర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వైన్స్ యజమానులు ఒక్కో సీసాపై రూ.20 అదనంగా వసూలు చేస్తుండగా, బెల్ట్ షాపు నిర్వాహకులు మరో రూ.20 కలిపి మొత్తం రూ.40 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ అదనపు వసూళ్లను కప్పిపుచ్చేందుకే సీసాలపై స్టిక్కర్లు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ స్టిక్కర్ల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. అదేవిధంగా బ్రాండ్ షాపులలో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అధిక రేట్లకు అమ్ముతున్నారు దీనిపై విచారణ పూర్తయితే అసలు గుట్టు బయటపడనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!