Tuesday, October 27, 2026
Homeక్రైమ్ న్యూస్అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ పట్టివేత

అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ పట్టివేత

📰 Generate e-Paper Clip

శంకరపట్నం, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. శంకరపట్నం మండలంలోని మొలంగూరు క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

టీఎస్‌ 08 వీడీ 9010 నంబరు గల టిప్పర్‌లో అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామానికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కనుకుంట్ల మల్లేశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశవపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

అనుమతులు లేకుండా మొరం, ఇతర ఖనిజాలను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!