- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్‌కు మాజీ ఎంపీటీసీ ఫిర్యాదు
శంకరపట్నం, అక్టోబర్ 26 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదును సమర్పించారు.
గ్రామ సర్పంచ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు బిల్లులు సమర్పిస్తూ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, సంబంధిత అధికారులతో కుమ్మక్కై బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపించారు. సర్పంచ్ భర్త పంచాయతీ పాలకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.
పంచాయతీ నిధుల వినియోగం, చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన బిల్లులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గాండ్ల తిరుపతి కలెక్టర్‌ను కోరారు. విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
