Tuesday, October 27, 2026
Homeతెలంగాణకరీంనగర్నిరుపేద వైశ్య భక్తులకు అయోధ్య, కాశీ ఉచిత యాత్ర

నిరుపేద వైశ్య భక్తులకు అయోధ్య, కాశీ ఉచిత యాత్ర

📰 Generate e-Paper Clip

మూడో ఏడాది యాత్రకు శ్రీకారం.. రెండు ప్రత్యేక బస్సుల్లో 45 కుటుంబాలు

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): నిరుపేద వైశ్య భక్తుల ఆధ్యాత్మిక యాత్రకు గంప నారాయణ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. నగరంలోని వైశ్య భవన్‌ వద్ద ఆదివారం అయోధ్య, కాశీ ఉచిత యాత్రను ఘనంగా ప్రారంభించారు. మానకొండూర్‌ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంప శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యాత్ర మూడో ఏడాదిలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. నిరుపేద వైశ్య భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే ఉద్దేశంతో గంప శ్రీనివాస్‌ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సుమారు ఎనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, దాదాపు 45 కుటుంబాలకు చెందిన భక్తులను అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకెళ్తున్నట్లు వివరించారు.

యాత్రలో పాల్గొంటున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారని అతిథులు పేర్కొన్నారు. అయోధ్య శ్రీరాముడి, కాశీ విశ్వేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్‌, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు, యాత్ర నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!