Saturday, October 17, 2026
Homeతెలంగాణమూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

📰 Generate e-Paper Clip

  • ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

మహబూబాబాద్(చైతన్యగళం): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు.

ఈ సందర్భంగా వేమిశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు ఆటంకంగా మారకూడదని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల అభ్యున్నతితో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఆలయ పూజారి యుగేందర్ శర్మ మాట్లాడుతూ.. మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, నైతికతను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులతో పట్టుదలగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాలే శ్రవణ్ (చిన్నా), మాలే కిరణ్, చిదిరాల రవి, కామేశ్వరరావు, సోమ రాధాకృష్ణ, శ్రీరాం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!