మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం మహబూబాబాద్(చైతన్యగళం): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా వేమిశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన సహకారం అందించడం ప్రతి...