Wednesday, September 23, 2026
Homeతెలంగాణకరీంనగర్గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో మద్యం దుకాణాలకు సెలవు

గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో మద్యం దుకాణాలకు సెలవు

📰 Generate e-Paper Clip

  • శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశాలు

సిరిసిల్ల, సెప్టెంబరు 23 (చైతన్యగళం): వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన తేదీలను బట్టి జిల్లాలోని ఆయా మండలాల్లో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు.

సిరిసిల్ల, ముస్తాబాద్‌ మండలాల్లో సెప్టెంబరు 25 నుంచి 27 వరకు, వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సెప్టెంబరు 23 నుంచి 25 వరకు మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో సెప్టెంబరు 23, 24 తేదీల్లో, అలాగే సెప్టెంబరు 25, 26 తేదీల్లోనూ మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. చందుర్తి, కోనరావుపేట తదితర మండలాల్లో సెప్టెంబరు 24 నుంచి 26 వరకు వైన్‌షాపులు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!