Wednesday, November 11, 2026
Homeక్రైమ్ న్యూస్రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి.. మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి.. మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ (చైతన్యగళం): సిద్దిపేట–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హుస్నాబాద్ మండలం పందిళ్ల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మృతి చెందడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహాన్వి (7) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ భార్య స్వాతికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడు శ్రీహాన్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కోరారు.

రోడ్డు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని మంత్రి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!