- పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు
షాద్‌నగర్, సెప్టెంబరు 23 (చైతన్యగళం): కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాలను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గణనాథుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, విజయాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమాల్లో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, కుమారస్వామిగౌడ్, మాజీ అధ్యక్షుడు జంగా నర్సింహ, సర్పంచ్ ఎర్రోళ్ల జగన్, దయానంద్, మాజీ సర్పంచ్ జానిగే జగన్, గోవర్ధన్‌శెట్టి, కర్రోళ్ల సురేందర్, నవీన్‌చారి, కొందెరెడ్డి సుమన్, యువకులు, ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
