Wednesday, November 11, 2026
Homeతెలంగాణరంగారెడ్డిపేదల పాలిట వరం సీఎం సహాయ నిధి

పేదల పాలిట వరం సీఎం సహాయ నిధి

📰 Generate e-Paper Clip

  • నిరుపేద కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్, నవంబర్ 9 (చైతన్యగళం): పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.

ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలోని మంగల్ కుంట తండాకు చెందిన కేతావత్ లఖ్య నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురై వైద్య చికిత్స పొందారు. చికిత్స ఖర్చుల కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో రూ.20 వేల ఆర్థిక సాయం మంజూరైంది.

ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంజూరైన రూ.20 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును బాలుడి తండ్రి కేతావత్ లఖ్య నాయక్‌కు గోలి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పడకుండా ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతని, నిరుపేదలకు సహాయం అందించడం తనకు సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నల్లచెరువు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!