Wednesday, November 18, 2026
Homeతెలంగాణనిరుపేద కుటుంబానికి అండగా ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్

నిరుపేద కుటుంబానికి అండగా ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్

📰 Generate e-Paper Clip

  • ఇంటి స్లాబ్ నిర్మాణానికి సిమెంట్ అందజేత

తలకొండపల్లి, నవంబర్ 17 (చైతన్య గళం):

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్నవారికి సహాయం అందించడమే లక్ష్యంగా ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన కాశముని నరేష్‌ కుటుంబానికి ఇంటి స్లాబ్ నిర్మాణం కోసం అవసరమైన సిమెంట్‌ను ట్రస్ట్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందజేశారు.

నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరాలనే సంకల్పంతో ఉప్పల వెంకటేష్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సహకారంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

స్థానికులు మాట్లాడుతూ, మాటలకే పరిమితం కాకుండా పేద కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు, తలకొండపల్లి సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ పద్మ నరసింహ ముదిరాజ్, మాజీ సర్పంచ్ లలిత జ్యోతి, ఉపసర్పంచ్ నూకం కోటేశ్వర్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు విఠల్ ముదిరాజ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!