Wednesday, November 18, 2026
Homeతెలంగాణ25వ జాబ్ డ్రైవ్‌లో మరో 27 మందికి ఉద్యోగాలు

25వ జాబ్ డ్రైవ్‌లో మరో 27 మందికి ఉద్యోగాలు

📰 Generate e-Paper Clip

  • ఐదు విడతల్లో ఇప్పటివరకు 104 మందికి ఉపాధి అవకాశాలు

ఆమనగల్, నవంబర్ 17 (చైతన్యగళం):

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆయన సహకారంతో ఆమనగల్‌లో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 104 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

అక్టోబర్ 13న నిర్వహించిన ఈ జాబ్ డ్రైవ్‌కు 347 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా, వారిలో 248 మందిని తదుపరి ఎంపిక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్ చేశారు. ఐదు విడతల్లో కొనసాగిన ఎంపిక ప్రక్రియలో భాగంగా నవంబర్ 16న నిర్వహించిన ఐదో విడతలో మరో 27 మంది ఉద్యోగాలు సాధించారు. దీంతో ఈ జాబ్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారి సంఖ్య 104కు చేరింది.

యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన 104 మంది యువతకు అభినందనలు తెలియజేస్తూ, పట్టుదలతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి మహేష్, ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!