- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆర్ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
కల్వకుర్తి, నవంబర్ 17 (చైతన్యగళం):
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలో ఆర్ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఎఫ్ఎల్–1 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, మున్సిపల్ మాజీ స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ కుడుముల మనోహర్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు దాచేపల్లి శ్రీనివాసులు, గంధము కిరణ్ ప్రసాద్, గంప శ్రీనివాసులు, పూరి రమేష్, బీఆర్ఎస్ నాయకులు దారమోని గణేష్, గండికోట రాజు, పాండు గౌడ్, మేకల శ్రీనివాసులు, టోర్నమెంట్ నిర్వాహకులు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు వట్టేపు కిషోర్, నరేష్, దుబ్బ నాగేష్, అనిల్, ఆర్ఎస్‌పీ ఫౌండేషన్ సభ్యులు అశ్విన్, కిరణ్, రాము తదితరులు పాల్గొన్నారు.

