Saturday, November 21, 2026
Homeక్రైమ్ న్యూస్ఎల్కతుర్తి శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ఎల్కతుర్తి శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

📰 Generate e-Paper Clip

  • 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కాకతీయ వాంటేజ్‌ వెంచర్‌ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు వారు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకుని విచారించగా, దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్‌, మట్టెడ జశ్వంత్‌, పుప్పాల గణేష్‌గా గుర్తించారు. వీరు గత రెండేళ్లుగా గంజాయికి అలవాటు పడినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుల్లో ఒకరైన శ్రీధర్‌ ఈ నెల 28న హుజూరాబాద్‌కు వెళ్లి అక్కడ ఆకాష్‌ అనే వ్యక్తి వద్ద రూ.1,500లకు 30 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు రాత్రి శ్రీధర్‌, జశ్వంత్‌ కొంత గంజాయి సేవించారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురూ కలిసి కాకతీయ వాంటేజ్‌ వెంచర్‌ సమీపంలో గంజాయి సేవించి, మిగిలిన గంజాయిని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని వివరించారు.

వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!