Saturday, November 21, 2026
Homeతెలంగాణకరీంనగర్సాగు భూముల సంరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

సాగు భూముల సంరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

📰 Generate e-Paper Clip

  • రైతులకు అవగాహన కల్పించిన అధికారులు: సర్పంచ్‌ ముప్పు మానస మహేందర్‌

తిమ్మాపూర్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

సాగు భూముల సంరక్షణ, భూసారం పెంపు లక్ష్యంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్‌ ముప్పు మానస మహేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిమ్మాపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి రోజా, ఉద్యానవన శాఖ అధికారి ప్రభావతి, విద్యుత్తు శాఖకు చెందిన సుధాకర్‌, కేవీకే రఘు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యం, ఇంకుడు గుంతల నిర్మాణం, పంట మార్పిడి విధానాల గురించి వివరించారు. సాగు భూముల సంరక్షణకు అవసరమైన పద్ధతులను రైతులు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!