ఎల్కతుర్తి శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్
20 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం ఎల్కతుర్తి, అక్టోబర్ 30 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కాకతీయ వాంటేజ్ వెంచర్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు వారు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ముగ్గురు యువకులు...