- బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపు
హుస్నాబాద్, నవంబర్ 21 (చైతన్యగళం): ఈ నెల 23న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మహా పాదయాత్ర నేపథ్యంలో శనివారం హుస్నాబాద్ పట్టణంలోని బి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ హుస్నాబాద్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బైరి శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మహా పాదయాత్ర ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు బాధ్యతలు అప్పగించి పాదయాత్రకు ప్రజల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మండల ప్రభారి తోట స్వరూప, మాజీ అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మాజీ అధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మాజీ అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శులు రత్నాకర్‌రెడ్డి, బైరి అరుణ్, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యురాలు చిన్మయి, ఓబీసీ మండల అధ్యక్షుడు పూదరి కిష్టయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మంద మహేశ్వర్‌రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సొళ్ళు రజనీకాంత్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కండె శంకర్, మండల ఉపాధ్యక్షులు కుంట మల్లయ్య, భూతగడ్డపు బాలరాజు, బత్తుల శ్రీనివాస్, మండల కార్యదర్శి నార్లపురం సత్యం, సీనియర్ నాయకులు బొమ్మగాని జగన్నాథం, వెల్దండి సత్యనారాయణ, నెల్లి శ్రీనివాస్, జంగ వెంకట్‌రెడ్డి, బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్, భాష, బత్తిని మధు, గుజ్జుల బాలరాజు, పోలవేణి సందీప్, గీకురు సంతోష్, గుండాల ప్రశాంత్, శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మగాని ఈశ్వర్, పుట్ట కొమురయ్య, మెరుగు రవీందర్, కనకట్ల కిషన్, సొల్లు నాగార్జున, భక్తుల నాగార్జున, మీదిని కొమరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

