Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

  • పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

వర్షాభావ పరిస్థితులు, విద్యుత్తు సరఫరా సమస్యల కారణంగా పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించడంతోపాటు హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ డివిజన్‌ వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ టి. రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ బావులు, బోర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. మరోవైపు వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో అందుబాటులో ఉన్న నీటిని కూడా పంటలకు అందించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ ఆశించిన దిగుబడులు రాక రైతులు అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొమ్మెర నర్సింహారెడ్డి, గుగులోతు తిరుపతినాయక్‌, మాటూరి రాజశేఖర్‌గౌడ్‌, బత్తుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!