అథ్లెటిక్స్‌లో మెరిసిన హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి
400 మీటర్ల పరుగులో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం.. జి. రిశ్వంత్‌కు ప్రిన్సిపాల్, అధ్యాపకుల అభినందనలు హుస్నాబాద్, అక్టోబర్ 29 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) విద్యార్థి జి. రిశ్వంత్ ప్రతిభ చాటాడు. అండర్-19 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్‌తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించింది. 2026 అక్టోబర్ 26న సిద్దిపేటలోని ప్రభుత్వ...