Thursday, October 29, 2026
Homeతెలంగాణకరీంనగర్ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

📰 Generate e-Paper Clip

  • క్వింటాకు రూ.3,500 చెల్లించి రైతులను ఆదుకోవాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్

అక్కన్నపేట, అక్టోబర్ 29 (చైతన్యగళం):

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కన్నపేట మండలం మల్లెచెట్టు తండా పరిధిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని, మరోవైపు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడంతోపాటు క్వింటాకు రూ.3,500 చొప్పున ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని రాజు నాయక్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే మండలంలో ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గొల్లెన రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఇరువు రమేష్, భూక్య రాజు, మాజీ సర్పంచులు భూక్య మల్లేశం, గుగులోతు శంకర్ నాయక్, ఉపసర్పంచ్ భూక్య విట్టల్, మాజీ ఉపసర్పంచ్ గుగులోతు రంగా, బీఆర్ఎస్ నాయకులు భానోతు సంతోష్, గుగులోతు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!