బాలల భద్రతపై న్యాయ అవగాహన కార్యక్రమం

సిద్దిపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం): బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కృషి చేయాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ. కుమారస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ న్యూ హైస్కూల్‌లో పోక్సో చట్టం–2012పై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు....