Wednesday, October 28, 2026
Homeతెలంగాణవిద్యార్థులకు బాలల హక్కులు భద్రతపై అవగాహన

విద్యార్థులకు బాలల హక్కులు భద్రతపై అవగాహన

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం):

బాలల భద్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్, సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. సుదర్శన్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలోని శారద హైస్కూల్, ఇర్కోడులోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన కె. సౌజన్య మాట్లాడుతూ, విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, బాలల హక్కులు, పోక్సో చట్టం–2012పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని తెలిపారు. ఆన్‌లైన్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో శారద హైస్కూల్ డైరెక్టర్ డి. శారద, ప్రిన్సిపల్ పి. మౌనిక, సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వి. దివ్య, చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్‌కు చెందిన ఎన్. గణేష్, ఇర్కోడు తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రవీందర్ గౌడ్, మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ స్వర్ణకుమారి, పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!