Tuesday, October 27, 2026
Homeతెలంగాణరంగారెడ్డిపట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • ప్రతి మండలం, డివిజన్‌లో 2 వేల మంది నమోదు లక్ష్యం.. నవంబర్‌ 2న ట్యాంక్‌బండ్‌ మహా పాదయాత్రకు 100 మంది కార్యకర్తలు హాజరుకావాలి

రంగారెడ్డి , అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌ భూపాల్‌ గౌడ్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి మండలం, డివిజన్‌ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా బాధ్యతతో కృషి చేయాలని సూచించారు.

2026 నవంబర్‌ 6లోపు ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి మండలం, డివిజన్‌లో కనీసం 2,000 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నమోదు చేసుకున్న ప్రతి ఓటరుకు సంబంధించిన రిఫరెన్స్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌తో కూడిన జాబితాను సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

అలాగే, నవంబర్‌ 2న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరుకానున్న నేపథ్యంలో, ప్రతి మండలం, డివిజన్‌ నుంచి కనీసం 100 మంది కార్యకర్తలు పాల్గొనేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమానికి కార్యకర్తలను సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, డివిజన్‌ నాయకులు సమన్వయ సమావేశాలు నిర్వహించి, పట్టభద్రుల ఓటర్ల నమోదు, మహా పాదయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంతంగి రాజ్‌ భూపాల్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!