Sunday, November 15, 2026
Homeతెలంగాణరంగారెడ్డిచీపునుంతల గ్రామానికి చెందిన 14 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత

చీపునుంతల గ్రామానికి చెందిన 14 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత

📰 Generate e-Paper Clip

  • అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్, నవంబర్ 14 (చైతన్యగళం):

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చీపునుంతల గ్రామానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఆమనగల్‌ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ కిరణ్‌ మై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందించారు.

నూతన పింఛన్ల మంజూరుతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభించడంతో పాటు వారి జీవనానికి కొంత ఆసరా కలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అర్హులైన నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ సంక్షేమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అర్హులైన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!