- నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళగా గుర్తింపు
ఇల్లంతకుంట, అక్టోబర్ 27 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన సంపతి రాజవ్వ (70) మృతదేహం మంగళవారం గ్రామ శివారులోని కెనాల్లో లభ్యమైంది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
కెనాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులు, ఆభరణాలను బట్టి రాజవ్వగా గుర్తించారు.
సమాచారం అందుకున్న ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్రచారి ఘటనా స్థలానికి చేరుకుని, సిరిసిల్ల నుంచి ఫోరెన్సిక్ వైద్యులను రప్పించారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

