Tuesday, October 27, 2026
Homeతెలంగాణమహబూబ్‌నగర్పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

  • నవంబర్‌ 16 వరకు సాధారణ ఫీజుతో చెల్లింపునకు అవకాశం
  • విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించాలి: డీఈఓ ఏ. రమేష్‌కుమార్‌

కల్వకుర్తి, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న 2027 పదో తరగతి వార్షిక పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రూ.125 పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో అదనపు గడువులు కల్పించినట్లు డీఈఓ తెలిపారు. నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 1 వరకు రూ.50 ఆలస్య రుసుముతో, డిసెంబర్‌ 3 నుంచి 14 వరకు రూ.200 ఆలస్య రుసుముతో, డిసెంబర్‌ 16 నుంచి 28 వరకు రూ.500 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వివరించారు.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ల ద్వారా మాధ్యమిక విద్యా బోర్డు వెబ్‌సైట్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువులను గమనించి, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫీజు చెల్లించాలని డీఈఓ ఏ. రమేష్‌కుమార్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!