Sunday, October 25, 2026
Homeఆంధ్రప్రదేశ్31వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా - వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ ఖాసిం వలి...

31వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా – వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ ఖాసిం వలి హామీ

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 31వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ ఖాసిం వలి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి మధుతో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా షేక్‌ ఖాసిం వలి మాట్లాడుతూ, వార్డులో రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.

వార్డు ప్రజల సమస్యలను మున్సిపల్‌ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే నిధుల సాధన కోసం పోరాడి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థికి ఒక ఓటు, కౌన్సిలర్‌ అభ్యర్థికి ఒక ఓటు వేసి ఫ్యాన్‌ గుర్తును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ బ్రహ్మయ్య ఆచారి, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటరమణ, రాము, జయకృష్ణ, షేక్‌ వలి, అబ్దుల్‌ హక్‌, షేక్‌ షావలి, రఫీ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!