పెద్దపల్లి, అక్టోబర్ 26 (చైతన్యగళం): ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనైతిక చర్య అని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెద్దపల్లిలోని రంగంపల్లి ఆర్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 73 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ, ఓటు పౌరుడి హక్కు అని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు ఎంత సాగునీరు అందించారో కేటీఆర్ వివరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు రావడంపై విమర్శలు చేశారు. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ సూచనల మేరకు మరమ్మతులు చేపట్టి వచ్చే జూన్ నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐఆర్ కార్యక్రమ ఏఐసీసీ పరిశీలకుడు ఎస్. శరత్, టీపీసీసీ పరిశీలకుడు కూన శ్రీశైలం గౌడ్, డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. వారితో పాటు రామగుండం మేయర్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
కేంద్రం కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది – ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
RELATED ARTICLES

