31వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా – వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ ఖాసిం వలి హామీ

నందికొట్కూరు (చైతన్యగళం): నందికొట్కూరు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 31వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ ఖాసిం వలి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి మధుతో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా షేక్‌ ఖాసిం వలి మాట్లాడుతూ, వార్డులో రహదారులు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు...