Sunday, November 15, 2026
Homeతెలంగాణవైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

  • భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు – ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన వేడుక

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారి కల్యాణ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగాయి.

ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం పెంపొందించడంతో పాటు, హిందూ ధర్మ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. భక్తుల సహకారంతో భవిష్యత్తులోనూ మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమమంతా భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!