Friday, October 23, 2026
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

  • అమరుల స్ఫూర్తితో ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డా. శబరీష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌తో కలిసి అమర పోలీసులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

హాట్ స్ప్రింగ్స్ ఘటనకు గుర్తుగా సంస్మరణ దినోత్సవం

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసుల త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమన్నారు.

దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులకు నివాళి

2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బంది త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎస్పీ అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు.

గతంలో తెలంగాణలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజల రక్షణ కోసం అనేక మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలే లక్ష్యం

అమరవీరుల సంస్మరణ దినోత్సవం నుంచి అక్టోబర్ 31న నిర్వహించే సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు పోలీసు అమరవీరుల స్మారకార్థం, పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీస్–ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అమర పోలీసులకు నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!