Thursday, October 22, 2026
Homeతెలంగాణనల్గొండదళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

📰 Generate e-Paper Clip

  • మిర్యాలగూడలో యూడీసీఎఫ్‌ ఆధ్వర్యంలో సాధన సదస్సు

మిర్యాలగూడ, అక్టోబర్‌ 22 (చైతన్యగళం‌): దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ యునైటెడ్‌ దళిత క్రైస్తవుల ఫెడరేషన్‌ (యూడీసీఎఫ్‌) ఆధ్వర్యంలో మిర్యాలగూడలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా సాధన సదస్సు ఘనంగా నిర్వహించారు. హౌసింగ్‌ బోర్డులోని విజయ గార్డెన్స్‌లో పెదమాం డేవిడ్‌ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కాశీం, డీఎస్పీ అధినేత డా. విశారదన్‌ మహారాజ్‌, ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని కోరారు. ఎస్సీ హోదాపై స్పష్టమైన వైఖరి ప్రకటించి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

ప్రొఫెసర్‌ కాశీం మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం న్యాయబద్ధమైన డిమాండ్‌ అని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రావు, ప్రొఫెసర్‌ డా. నతనియేలు, మర్రి ఎలియాస్‌, క్రిస్టాపర్‌, డి.ఐ. శాంసన్‌, ఆదిముల్ల ప్రభుదాస్‌, కడియం అబ్రహం, దుబ్బా డేవిడ్‌ రాజు, అంబటి ప్రభాకర్‌, చంద్రపాల్‌, జయమ్మ, విజయ్‌, శ్రీనివాస్‌, డా. రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!