- ఎన్నికల బరిలోకి వైఎస్సార్సీపీ.. మొదలైన రాజకీయ సందడి
గడివేముల, అక్టోబర్ 22 (చైతన్యగళం): గడివేముల మండలం ఓండుట్ల ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఓండుట్లలో తొలి నామినేషన్ దాఖలు కావడంతో స్థానికంగా రాజకీయ చర్చ మొదలైంది. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్‌తో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మరింత ఊపందుకోనుండటంతో రాజకీయ పరిణామాలపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
