Monday, October 19, 2026
Homeతెలంగాణకరీంనగర్మంకమ్మతోట ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్‌లో బతుకమ్మ సంబరాలు

మంకమ్మతోట ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్‌లో బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

  • అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజూ వేడుకలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

కరీంనగర్‌లోని మంకమ్మతోట ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్‌ 10న అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బతుకమ్మ ఆటలు, కోలాటం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంఘం అధ్యక్షుడు పాత గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి జిల్లా కృష్ణమూర్తి, కోశాధికారి మల్యాల వెంకటేశం ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. మాజీ అధ్యక్షులు పాత శేఖర్‌, జిల్లా అంజయ్య కూడా కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తున్నారు.

ప్రతిరోజూ జరిగే వేడుకల్లో మంకమ్మతోట, రాంనగర్‌ ప్రాంతాలకు చెందిన సంఘ సభ్యులు, ట్రస్టు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ బతుకమ్మ ఆడుతూ, కోలాటం వేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కార్యక్రమాలకు హాజరయ్యే వారికి ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్‌ ఆధ్వర్యంలో అల్పాహార ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

సంఘ సభ్యులందరూ ఐకమత్యంతో వేడుకల్లో పాల్గొంటూ కార్యక్రమాల విజయవంతానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!