సద్దుల బతుకమ్మ వేడుకల్లో బొడ్ల రామకృష్ణ–నర్మదా దంపతులకు ద్వితీయ బహుమతి

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు తల్లాడ వెంకట రామారావు, ప్రధాన కార్యదర్శి వేమిశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో శ్రీ వాసవి ప్రింటర్స్, ఎస్ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్ అధినేత బొడ్ల రామకృష్ణ, నర్మదా దంపతులు పేర్చిన బతుకమ్మకు ద్వితీయ బహుమతి లభించింది....