Sunday, October 18, 2026
Homeతెలంగాణ40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని సిగ్నల్‌ కాలనీకి సీసీ రోడ్లు

40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని సిగ్నల్‌ కాలనీకి సీసీ రోడ్లు

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే డాక్టర్‌ మురళి నాయక్‌ సహకారంతో నిర్మాణ పనులు ప్రారంభం

మహబూబాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):

మహబూబాబాద్‌ పట్టణంలోని సిగ్నల్‌ కాలనీలో సుమారు 40 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోని వీధులకు ఎట్టకేలకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 26వ వార్డు కౌన్సిలర్‌, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాలోతు శ్రీదేవి బాలునాయక్‌ ఆధ్వర్యంలో, మానుకోట శాసనసభ్యుడు డాక్టర్‌ మురళి నాయక్‌ సహకారంతో శనివారం బద్రు ఇంటి సమీపం నుంచి నున్న భద్రయ్య ఇంటి వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా మాలోతు శ్రీదేవి మాట్లాడుతూ, సిగ్నల్‌ కాలనీ ఏర్పడి సుమారు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా గత పాలకుల హయాంలో ఇరుకైన వీధుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదని తెలిపారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలను గుర్తించి, వారికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, ఎమ్మెల్యే డాక్టర్‌ మురళి నాయక్‌ సహకారంతో అభివృద్ధి పనులను దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సహాయ ఇంజినీర్‌ సౌజన్య, వర్కింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, చుక్క శ్యాం ప్రసాద్‌, అజ్మీర శ్రీకాంత్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!