Sunday, November 8, 2026
Homeక్రైమ్ న్యూస్చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ

చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

  • బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం

కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌ను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసుల వివరాలు, రౌడీషీటర్ల జాబితాలను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం, నిర్బంధ గదిని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని సీపీ ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, గ్రామాల్లో నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ తనిఖీలో తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, చిగురుమామిడి ఎస్‌ఐ జగదీశ్వర్‌తో పాటు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!