జగిత్యాల, అక్టోబర్ 16 (చైతన్యగళం): జగిత్యాల గ్రామీణ మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంతో పాటు రాయికల్ పట్టణంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన నిధుల ద్వారా మంజూరు చేశారు. ఈ మేరకు మంజూరుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి శుక్రవారం అందజేశారు.
హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు లభించడంతో పాటు ప్రజలకు భద్రత, సౌకర్యం పెరుగుతాయని నాయకులు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, స్థానిక కౌన్సిలర్ కల్లెడ ధర్మపురి, సురేష్, రాము, ఆముదరాజు, తక్కళ్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ కచ్చు మునిరాజు, బన్న సంజీవ్, గుర్రాల తిరుపతిరెడ్డి, పవన్‌సింగ్, రవితేజ, బోగ నరేష్, శ్రీనివాస్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
