Thursday, October 15, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

  • మహిళా పోలీసుల కోసం పరేడ్‌ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు
  • ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఎఫ్‌ఓ సత్యనారాయణ

కరీంనగర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం చొరవతో జరిగిన ఈ వేడుకల్లో మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు.

ఈ వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

పోలీసు కుటుంబాల కోసం ప్రత్యేక వేడుకలు

ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం మాట్లాడుతూ, పండుగల సమయంలో ప్రజల భద్రత కోసం పోలీసులు రేయింబవళ్లు బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంటారని తెలిపారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజున పోలీసు సిబ్బంది విధుల్లో బిజీగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ముందుగానే ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించినట్లు వివరించారు.

పోలీసుల సేవలు అభినందనీయం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌ మాట్లాడుతూ, ప్రజలు ఇళ్లలో సురక్షితంగా, ప్రశాంతంగా పండుగలు జరుపుకోవడానికి పోలీసు శాఖ నిర్వహించే బందోబస్తు విధులు కీలకమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందిస్తూ, అందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ, పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది, వారి కుటుంబాల కోసం ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసు సిబ్బందికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!