Wednesday, November 4, 2026
Homeతెలంగాణకరువు పరిస్థితులపై ప్రభుత్వంతో చర్చించాలి

కరువు పరిస్థితులపై ప్రభుత్వంతో చర్చించాలి

📰 Generate e-Paper Clip

  • ఉత్తరాలు రాయడంతో సరిపెట్టకుండా హుస్నాబాద్‌ రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి: అయిలేని మల్లికార్జునరెడ్డి

హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రివర్యులు కేవలం ఉత్తరాలు రాయడంతో సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై మంత్రికి పూర్తి అవగాహన ఉందని, ప్రత్యేక దృష్టి సారించి హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. మరోవైపు వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రైతులు సాగు చేసిన కొద్దిపాటి పంటలు సైతం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో సరైన సాగునీటి వసతులు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పంటలను కోతుల బెడద కూడా తీవ్రంగా వేధిస్తోందని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. సాగు చేసిన పంటల్లో సగానికి పైగా ఎండిపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయం కోసం అప్పులు చేసిన రైతులపై మరింత ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా కృషి చేయాలని అయిలేని మల్లికార్జునరెడ్డి రైతుల పక్షాన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!